TPT: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం జరిగింది. ఉగాది ఉత్సవాల్లో చెవిరెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.