VKB: మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని వేగంగా FCIకి తరలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మిల్లర్లకు సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం సేకరణకు సంబంధిత అధికారులతో కార్యాచరణ ప్రణాళికపై రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 129 వరి ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.