ఉగాది పండగ సందర్భంగా అందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయాలతో ముడిపడి ఉండటంతోపాటు కొత్త శక్తి, ఆరంభాలకు ఈ పండగ ప్రతీక అని, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థించారు. తమ ఆకాంక్షలను చిత్తశుద్ధితో కొనసాగించేలా, సమాజ శ్రేయస్సుకు సానుకూలతతో దోహదపడేలా ఈ ఏడాది అందరినీ ప్రేరేపించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.