W.G: రాష్ట్రంలోని సుమారు 5,000 మసీదులకు అక్టోబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు రూ.45 కోట్ల నిధులు విడుదలైనట్లు వక్ఫ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ కరిముల్లా తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 207 మసీదులకు సంబంధించి 6 నెలల కాలానికి సంబంధించి రూ.1,86,30,000 మొత్తాన్ని నేరుగా ఆయా మసీదుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.