MHBD: బయ్యారం మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించి మొక్కజొన్నను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో క్వింటాకు కేవలం రూ.1,600–1,700 మాత్రమే లభించడం వల్ల రైతులు తీవ్ర నష్టంలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య తెలిపారు.