ప్రకాశం: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను బుధవారం హైదరాబాదులోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఒంగోలుకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.