ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే(kondeti chittibabu) ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతని బ్రైయిన్లో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.
ycp mla kondeti chittibabu is illness treatment in icu kims hospital
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు(kondeti chittibabu) ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థతకు గురికావడంతో రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించగా.. చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. దీంతో వెంటనే ఆయన్ను ప్రత్యేక చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి(kims hospital) తరలించారు. చిట్టిబాబు కుమారుడు వికాస్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని వైద్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది.