సత్యసాయి: పుట్టపర్తి సబ్‌డివిజన్ పరిధిలోని నల్లమాడ, ఆమడగూరు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, లాంగ్ పెండింగ్ కేసులు, ఎన్డీపీఎస్ కేసులపై సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అణిచివేయాలని, మహిళా భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.