TG: ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఒక్కసారిగా మారిన వాతావరణం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ రైతులకు మాత్రం తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కామారెడ్డి, సిద్దిపేట, జనగాం జిల్లాలో వడగండ్ల వాన కురవనుంది.