AKP: మండల కేంద్రమైన కోటవురట్లలో బుధవారం స్థానిక ఎంపీటీసీ పీవీ సూర్యారావు, టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి పర్యటనపై ప్రచారం నిర్వహించారు. ఈనెల 23న ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.