E.G: మాజీ ముఖ్య మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మండపేట పురపాలక సంఘం మాజీ ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి బుధవారం కలిశారు. మంగళవారంతో ఛైర్ పర్సన్ పదవి కాలం ముగిసింది. తనకు అవకాశం ఇచ్చినందుకు జగన్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ కంచుకోటగా ఉన్న మండపేట మున్సిపాలిలో తాము పోటీ చేసి గెలుపొందినట్లు వివరించారు.