SRCL: వేములవాడలో బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ పదవులకు పోటీ చేయనున్న అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి కోర్టు ప్రాంగణానికి చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కోర్టు పరిసరాల్లో ఎన్నికల వాతావరణం కనిపించింది.