W.G: నరసాపురంలోని పలు దేవాలయాల్లో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఏడాది కాలానికి శ్రీ ఆదికేశవ ఎంబరుమానార్ స్వామి ఆలయానికి రూ.1,08,558 ఆదాయం సమకూరింది. శ్రీ అమరేశ్వర స్వామి క్షేత్రంలో రూ.86,460, శ్రీ మదన గోపాలస్వామి ఆలయంలో రూ.23,760 భక్తులు కానుకలుగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు ప్రక్రియ దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో జరిగింది