MDK: బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేవారికి వ్యవహరించవద్దని మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాయలగారి కృష్ణ శర్మ అన్నారు. పెద్ద శంకరంపేట శివాలయంలో సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బ్రాహ్మణులపై చేసిన వాఖ్యలు అర్థరహితమన్నారు. ఈ వాఖ్యలను బ్రాహ్మణ సంఘం ఖండిస్తుందన్నారు. ఎమ్మెల్యే బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.