AP: గన్నవరం ఎయిర్పోర్ట్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చిన ఇండిగో విమానానికి వాతావరణం అనుకూలించకపోవడంతో టేకాఫ్ చేసిన వెంటనే ల్యాండింగ్ చేశారు. కాసేపు గాల్లో చక్కర్లు కొట్టి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. ఈ విమానంలో MP కేశినేని చిన్ని ఉన్నారు. ఇండిగో విమానం కాసేపట్లో మళ్లీ గన్నవరం బయల్దేరనుంది.