»Alert To Bank Customers Bandh For 16 Days In September
Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..సెప్టెంబర్లో 16 రోజులు బంద్
రేపటితో ఆగస్టు నెల ముగుస్తుంది. ప్రతి నెలా అనేక రంగాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయో వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రజల సౌకర్యార్థం ప్రతి నెలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. మరి సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో మూతపడనున్నాయో తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి.
సెప్టెంబర్ 6 : శ్రీకృష్ణ జన్మాష్టమి (ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
సెప్టెంబర్ 29 : సిక్కిం, జమ్ము, శ్రీనగర్లో ఇంద్రజాత్ర (ఈద్ ఈ మిలాద్ మరుసటి రోజు) సందర్భంగా బ్యాంకులకు సెలవు.
ఇవేకాకుండా రెండో, నాలుగో శనివారాలు సెలవు ఉంటుంది. అలాగే 4 ఆదివారాలు ఉన్నాయి. హాలిడేస్ అన్నీ కలుపుకొని సెప్టెంబర్లో మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.