అన్నమయ్య: రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి “దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుందన్నారు. సమాన అవకాశాల సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగులకు స్వావలంబన, గౌరవప్రద జీవనానికి ఈ పథకం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.