»Raksha Bandhan Wishes For Brother Tollywood Heros Her Sisters
Raksha bandhan 2023: హీరోల సోదరీమణుల గురించి మీకు తెలుసా?
ఈరోజు రాఖీ పండుగ. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు, వారి సోదరీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీంతోపాటు వారి అరుదైన ఫోటోలను కూడా ఇక్కడ చూసేద్దాం.
Raksha Bandhan wishes for brother Celebrities Rakshabandhan Special
Raksha Bandhan: దేశంలో అందరు సగౌరవంగా జరుపునే పండుగలో రాఖీ పండుగ ముఖ్యమైనది. అలాగే సినిమా సెలబ్రెటీలు కూడా అందరిలాగే రక్షబంధన్ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన ఫేవరెట్ స్టార్స్ వారి సోదరిలతో అప్యాయంగా ఉన్న ఫోటలను ఇప్పుడు చుద్దాం.
తెలుగు తెర శిఖరం మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు సోదరులు, ఇద్దరు చెల్లెల్లు అన్న విషయం తెలిసిందే. అందులో పెద్దావిడ విజయ దుర్గ. హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌ల తల్లి. అలాగే రెండవ చెల్లెలు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను బాధ్యత చూసుకుంటున్నారు.
పవన్ కల్యాణ్, నాగబాబులకు కూడా వారి చెల్లెల్లు అంటే ఎనలేని ప్రేమ. ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓజీ చిత్రంలో. అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.
కింగ్ నాగార్జున అక్కినేని వారసుడిగా ఇండస్ట్రిలోకి ఆరంగేట్రం చేసి యువ సామ్రాట్‌గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ కు ఒక అన్న ముగ్గురు సోదరులు ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ చాలా పెద్దది. ఆయన తోడ ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెల్లు ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య భగవంత కేసరి సినిమా తెరకెక్కిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇద్దరు సోదరీమణులు. అందులో ఒకరు మంజుల, ఇంకో సిస్టర్ హీరో సుధీర్ బాబు భార్య.
రామ్ చరణ్ కు ఇద్దరు సిస్టర్లు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సోదరి నిహారికా. ప్రస్తుతం వీరిద్దరూ తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు కుడా ప్రబోధ్ అనే సోదరుడు, సోదరి ప్రగతి ఉన్నారు. అతను తన మేనమామ కృష్ణం రాజుకి మేనల్లుడు. కృష్ణం రాజుకు ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి.
హీరో రానా దగ్గుబాటి నిర్మాత సురేష్ బాబు కొడుకు. మాళవిక దగ్గుబాటి రానాకి తోబుట్టువు. రానా మేనమామ వెంకటేష్ దగ్గుబాటికి ముగ్గురు కుమార్తెలు ఆశ్రిత, భావన, హయవాహిని.
తెలుగు సినిమా పవర్ ఫుల్ ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచు విష్ణు, మనోజ్ లకు లక్ష్మి సోదరిగా ఉంది. వీరి తండ్రి మోహన్ బాబు.
నేచురల్ స్టార్ నాని తన సోదరి దీప్తి గంటాతో చాలా మంచి అనుబంధాన్ని కల్గి ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గురించి పంచుకుంటారు.
హీరో నితిన్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కుమారుడు. ఆయనకు నికితారెడ్డి అనే అక్క ఉంది.
యంగ్ రామ్ పోతినేనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. సోదరుడు కృష్ణ చైతన్య, సోదరి మధు స్మిత పోతినేని.