ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల శక్తి పథకంలో భాగంగా 40% పైన ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు జేసీ తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సులలో దివ్యాంగులకు 50శాతం రాయితీతో ప్రయాణం చేయవచ్చన్నారు.