పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను రీమేక్ చేయొద్దని మొర పెట్టుకుంటున్నారు అభిమానులు. కానీ పవన్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. స్ట్రెయిట్ ఫిల్మ్ చేస్తే ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. అదే రీమేక్ అయితే.. షార్ట్ టైంలో అయిపోతుంది. పవన్ రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్ సినిమాలే. ప్రస్తుతం పవన్ చేస్తున్న స్ట్రెయిట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇది స్ట్రెయిట్ సినిమా అవడం వల్లే.. గత రెండేళ్లుగా షూటింగ్ పూర్తవడం లేదేమో. పైగా పవన్ రాజకియంగా బిజీగా ఉండడంతో.. రీమేక్ చిత్రాలే బెటర్ అనే మూడ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళ్ హిట్ మూవీ ‘వినోదయ సీతమ్’ రీమేక్ చేస్తున్నారు. ఎప్పుడో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం.. షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. అయితే నిన్న మొన్నటి వరకు హరిహర వీరమల్లు సినిమా గెటప్‌లోనే ఉన్న పవన్.. తాజాగా నార్మల్ లుక్‌లోకి వచ్చేశాడు. ఉన్నట్టుండి పవన్ లుక్ మారిపోవడం వెనక అసలు కారణం ఇదే అంటున్నారు. వినోదయ సీతమ్ రీమేక్ కోసం పవన్ తన లుక్ మార్చినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ జనవరి 27 నుంచి స్టార్ట్ అవనుందని సమాచారం. పవన్ ఈ చిత్రానికి మూడు వారాలు కాల్షీట్స్ ఇచ్చారట. ఈ మూవిని ఒరిజినల్ డైరెక్టర్ సముద్రఖనినే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు. అతనికి జోడిగా కేతిక శర్మ హీరోయిన్గా ఫిక్స్ అయిందని టాక్. మరి ఈ రీమేక్‌తో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.