బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ…..త్వరలోనే కాంగ్రెస్ లోకి అడుగుపెడతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వరుణ్ గాంధీ… బీజేపీ విధానాలపై విమర్శలు చేస్తూ ఉండటంతో.. ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. కాగా… ప్రస్తుతం జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఇదే విషయం ప్రశ్నించగా… ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
వరుణ్ గాంధీ… కాంగ్రెస్ లోకి రారు అని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు తాను వ్యతిరేకం అని… ఆ సిద్ధాంతాలను వరుణ్ గాంధీ ఎప్పటి నుంచో అనుసరిస్తున్నారని ఆయన అన్నారు. వారిద్దరి సిద్ధాంతాలు భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లనని కూడా స్పష్టం చేశారు. దేశంలో ఆర్ఎస్ఎస్ చాలా మంచి పని చేస్తుందని కొన్నాళ్ల క్రితం వరుణ్ గాంధీ తనతో చెప్పారని అన్నారు. తమ కుటుంబ చరిత్రను చదివి అర్థం చేసుకోమని చెప్పానని.. తమ కుటుంబం భావజాలాన్ని అర్థం చేసుకుంటే ఎవరూ అలా అనరని వ్యాఖ్యానించరు అని ఆయన అన్నారు.
‘‘వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నారు. ఆయన ఇక్కడికి వస్తే, ఆయనకు అదొక సమస్య కావచ్చు. ఆయన భావజాలంతో నా భావజాలం సరిపోలదు. నేను ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లను. అది జరగాలంటే అంతకుముందే నా తల తెగిపడాలి. నా కుటుంబానికి ఓ సిద్ధాంతం, భావజాలం ఉన్నాయి. వరుణ్ మరొకదానిని అనుసరిస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతాన్ని నేను అంగీకరించలేను’’ అని చెప్పారు.