TG: అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్లో BRS ఎమ్మెల్యేలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరగనున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావాలని వారిని సాదరంగా ఆహ్వానించారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ భేటీలో ఫ్యాక్టరీ ప్రాధాన్యతను వివరించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరడం ఆసక్తిని రేకెత్తించింది.