AP: ప్రకాశం జిల్లా అద్దంకిలో విషాదం నెలకొంది. పదవ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష రాసి ఇంటికి వెళ్లేసరికి విద్యార్థిని వర్షిత తల్లి ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, పుట్టెడు దుఃఖంలోనూ ధైర్యం కోల్పోకుండా ఆ విద్యార్థిని ఇవాళ అద్దంకి బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో పరీక్షకు హాజరైంది.