MHBD: సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ జనరల్ సెక్రటరీ, చీఫ్ కో-ఆర్డినేటర్‌గా రఘువీర్ రాథోడ్ నియామకం అయ్యారు. HYD ఉస్మానియా యూనివర్సిటీలో సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్, రాష్ట్ర అద్యక్షులు బానోతు హుస్సేన్ నాయక్ చేతుల మీదుగా మంగళవారం ఆయన నియామకపత్రాన్ని అందుకున్నారు. లంబాడి, గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.