విశాఖలో గంజాయి, నార్కోటిక్ డ్రగ్ కట్టడిలో భాగంగా మంగళవారం ఆర్.టీ.సీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్డులో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. దీనిలో భాగంగా కిరండోల్ ట్రైన్లో 6 కేజీల గంజాయిని నార్కోటిక్ డాగ్ లైకా సహాయంతో గుర్తించారు. గంజాయిని గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు.