నెల్లూరు: నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ హయాంలో అనుమతులు లేని లేఅవుట్లలో భవన నిర్మాణాలకు అనుమతులు, పట్టణ ప్రణాళిక నిబంధనల ఉల్లంఘన వంటి వాటిపై గతంలో ఫిర్యాదులు అందాయి.