ఏపీ కేడర్‌కు చెందిన 2018 బ్యాచ్ IAS అధికారి హిమాంశు కౌశిక్‌ను కేంద్ర ప్రభుత్వం యూపీకి బదిలీ చేసింది. ఇటీవల ఆయన యూపీ కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ IAS అధికారిణి దీక్షా జోషిని వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తనను యూపీకి బదిలీ చేయాలని ఆయన కోరగా.. కేంద్రం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.