RR: కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని కౌన్సిలర్ రాజునాయక్ స్పష్టం చేశారు. షాద్నగర్ ఆరవ వార్డు టీచర్స్ కాలనీలో రోడ్డు సమస్య గురించి స్థానికులు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే రోడ్డులో మట్టి పోసి జేసీబీ వాహనంతో లెవెల్ చేయించారు. కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే తనకు తెలపాలని, పూర్తిస్థాయిలో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.