MLG: జిల్లా కలెక్టరేట్లోని EVM గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, అగ్ని నివారణ పరికరాలు, భద్రతా ఏర్పాట్లను వివరంగా పరిశీలించారు. రాత్రింబవళ్లు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.