SKLM: పలాస కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే శిరీష మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలు విద్యాబోధన విధానాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో ఎమ్మెల్యే విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు.