»Rains In Ap And Telangana For Three Days August 20 To 23rd 2023
Rains: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు!
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మూడు రోజుల పాటు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు తీవ్రమైన గాలులు కూడా వీస్తాయని ప్రకటించారు.
Rains in Telangana next four days upto october 2nd 2023
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వర్షాలు(rains) కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాదు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన వానలు వస్తాయని చెప్పింది. మరోవైపు ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
దీంతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్(alert) జారీ చేశారు. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేట కోసం వెళ్లవద్దని సూచించారు.
మరోవైపు తెలంగాణ(telangana)లో వాతావరణ శాఖ కూడా వర్ష హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.