సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కొద్దిసేపటి క్రితం యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లక్నోలోని సీఎం ఇంటికి వెళ్లిన రజనీకి యోగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రజనీకాంత్…యోగి కాళ్లు మొక్కారు. అనంతరం ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.రజినీ అంటే సూపర్ స్టార్(Super star). ఆయన వయస్సు ఏమీ తక్కువ కాదు.. 72 ఏళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరి ముందు తల వంచలేదు.. గౌరవంగానే తల వంచారు తప్పితే.. ఇప్పుడు ఏకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కాళ్లు మొక్కారు.
యోగీ వయస్సు 51 ఏళ్లు మాత్రమే. వయస్సు రీత్యా యోగీ కంటే రజినీకాంత్ 20 ఏళ్లు పెద్ద.. అయినా కూడా.. సూపర్ స్టార్ రజినీకాంత్ యోగీ కాళ్లకు మొక్కటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. శుక్రవారం లక్నోలో ఈ సినిమాను ప్రదర్శించారు.