TPT: వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరులోని బస్ షెల్టర్ అపరిశుభ్రంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు చెత్త వదిలివెళ్లడంతో దుర్గంధం వ్యాపించి, కూర్చోవడానికి వీలు లేక ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే శుభ్రపరిచి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.