Tillu lover: ముగ్గురు హీరోలతో టిల్లుగాడి లవర్ రొమాన్స్!
టిల్లుగాడి లవర్ రాధికాను అంత ఈజీగా మరిచిపోలేరు. మన టిల్లుగాడు సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్గా రాధికా పాత్రలో నటించింది హాట్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాతో అమ్మడి అందానికి ఫిదా అయ్యారు కుర్రాళ్లు. కానీ సీక్వెల్లో మాత్రం ఛాన్స్ అందుకోలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ముగ్గరు యంగ్ హీరోలతో కలిసి బ్యాక్ టు బ్యాక్ రాబోతోంది.
Tillu lover: ‘డీజే టిల్లు’ సినిమాతో టాలీవుడ్లో నేహా శెట్టి మంచి క్రేజ్ వచ్చింది. గ్లామర్ విషయంలో అమ్మడు చాలా హాట్‌గా ఉంటుంది. అందుకే యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.. ఇండస్ట్రీలో కూడా వరుస ఆఫర్స్ అందుకుంటోంది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా ఫోకస్ అవడం లేదు కానీ.. ఏకంగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది నేహా శెట్టి. యంగ్ హీరో కార్తీకేయ నటించిన ‘బెదురులంక 2012’లో హీరోయిన్గా నేహా శెట్టినే నటిస్తోంది. అలాగే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఛాన్స్ అందుకుంది. మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’ సినిమాలోను రొమాన్స్ చేస్తోంది. ఈ మూడు సినిమాలు కూడా నేహాకు కెరీర్లో ఎంతో కీలకం కానున్నాయి.
ప్రజెంట్ ఉన్న యంగ్ హీరోల్లో కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఒకేసారి ఈ ముగ్గురితో నటించడంతో టాలీవుడ్ ఫోకస్ ఇప్పుడు నేహా శెట్టి పై పడింది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో రచ్చ చేస్తోంది. రీసెంట్గా విశ్వక్ సేన్‌తో స్టేజి పై స్టెప్పులేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముందుగా ఆగష్టు 25న బెదురులంక రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రూల్స్ రంజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్‌లో చేసిన రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఒకవేళ ఈ సినిమాలు హిట్ అయితే.. యంగ్ హీరోలకు నేహా శెట్టి బెస్ట్ ఛాయిస్‌గా మారనుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలతో నేహా శెట్టి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.