NTR: నందిగామ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సౌమ్య మంగళవారం అన్నారు. నందిగామ బాబు జగజీవన్ రామ్ బిల్డింగులో నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొని, గత సంవత్సర కాలంలో రూ.114 కోట్లతో పట్టణ పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే 24 గంటల నీటి సరఫరా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.