»Ycp Clean Sweep Next Lok Sabha Elections Latest Survey Revealed
APలో ఫ్యాన్‌కు తిరుగులేదు.. సైకిల్ పంక్చర్ అవడం ఖాయం..? తాజా సర్వే
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మరోసారి సత్తా చాటనుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేయనుందని తెలిసింది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం.. వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.
YCP Clean Sweep Next Lok Sabha Elections Latest Survey Revealed
YCP Clean Sweep: మరో 7, 8 నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికిప్పుడు జనం ట్రెండ్ ఎలా ఉందనే అంశానికి సంబంధించి టౌమ్స్ నౌ సర్వే చేపట్టింది. ఏపీలో అధికార వైసీపీకి మళ్లీ జనం పట్టం కడతారని పేర్కొంది. టీడీపీ (TDP) ప్రభావం అంతగా లేదని.. గెలిస్తే ఓ పార్లమెంట్ సీటు గెలవొచ్చని అంచనా వేసింది. వైసీపీకి (YCP) 24-25 సీట్లు రానుండగా.. టీడీపీకి 0-1 సీటు రావొచ్చని తెలిపింది. మొత్తంగా వైసీపీ (YCP) క్లీన్ స్వీప్ చేయనుందని వెల్లడించింది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ అంతగా ప్రభావం చూపించే అవకాశం లేదు. బీజేపీ, కమ్యునిస్టుల ఇంపాక్ట్ కనిపించడం లేదు.
22 నుంచి 25 సీట్ల వరకు
గత లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ (ycp) 22 సీట్లను గెలుచుకుని బంపర్ విక్టరీ కొట్టింది. ఈ సారి మరో 3 సీట్లను గెలుచుకోబోతుందని సర్వేలో తేలింది. జూన్ 15వ తేదీ నుంచి ఆగస్ట్ 12వ తేదీ వరకు జనాల నుంచి అభిప్రాయాన్ని టైమ్స్ నౌ (times now) సేకరించింది. ఏప్రిల్ నెలలో చేసిన సర్వేలో కూడా దాదాపు ఇలాంటి రిజల్టే వచ్చింది. సో.. ఏపీలో వైసీపీ ఫ్యాన్‌ను ఆపడం చంద్రబాబు (chandrababu), లోకేశ్ (lokesh), పవన్ (pawan) వల్ల కావడం లేదని అర్థం అవుతోంది. అందుకే సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
లభించని ఆదరణ
బీజేపీతో జనసేన (janasena) జట్టుకట్టిన జనం మాత్రం ఆదరించడం లేదని సర్వే రిపోర్టుతో క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ- జనసేన భావిస్తోన్నాయి. తాజాగా వచ్చిన సర్వే మాత్రం ఆ పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది. యువగళం పేరుతో నారా లోకేశ్ (lokesh) యాత్రలో ఉండగా.. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. వీలు చూసుకొని మరీ చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అధికార మార్పిడి జరగాలని.. తమ పార్టీకి పట్టం కట్టాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో జనం మాత్రం వైసీపీ మీద, జగన్ మీద విశ్వాసంతో ఉన్నారని సర్వే ద్వారా తేటతెల్లం అయ్యింది.