KMM: కరెంటు షాక్ తగిలి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం ఉదయం కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఏన్కూరు మండలం తిమ్మారావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంతో విషాదఛాయలు అలుముకున్నాయి.