»Warning To Ap Minister Roja Janasena Veeramahila Akepati Subhashini
Janasena: రోజాకు జనసేన వీరమహిళల మాస్ వార్నింగ్
ఏపీ మంత్రి రోజాకు జనసేన వీరమహిళ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కంత్రిలా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే కత్తి మహేష్‌కు ఏం జరిగిందో తెలుసు కదా అని విమర్శించారు.
Warning to AP Minister Roja, Janasena veeramahila Akepati Subhashini
Janasena: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో హీట్ పెరిగిన విషయం తెలిసిందే. అధికార పార్టీ(YCP), ప్రతిపక్ష(TDP)పార్టీలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. అంతే వైఎస్సార్, జనసేన(Janasena) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మామూలుగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా(Roja) పవన్ కల్యాణ్ అంటే ఏదో శత్రువులా మాట్లాడుతుంటుంది. అంతే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న రోజాకు జనసేన వీర మహిళలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రోజా ఓ కంత్రిలాగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పవన్‌పై రోజా నోరు పారేసుకోవడం అంత మంచిది కాదని పేర్కొన్నారు. గతంలో కత్తి మహేష్ ఇలాగే నోటికి వచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేస్తూ అతికి ఎలాంటి గతి పట్టిందో అందరూ చూశారు. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్న రోజాకు కూడా అలాంటి గతే పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.
తిరుపతిలో ఆకేపాటి సుభాషిని(Aakepati Subhashini) మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు. రుషికొండను బోడిగుండు చేసిన వైసీపీ దోపిడీకి అంతులేదా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను దోచేస్తున్న వైసీపీ నుంచి ఏపీని కాపాడాలనే తపనతో పవన్ ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నిస్తున్నారని చెప్పారు. నెత్తిపై రూపాయి పెడితే పావలాకి కూడా అమ్ముడు పోని రోజా పెద్ద జ్ఞానిలా మాట్లాడుతుందని, ఇలాగే మాట్లాడితే ఏదోరోజు తాను పశ్చత్తాపపడుతుందని అన్నారు. వైసీపీ మంత్రులు అందరూ సీఎం వేసే బిస్కెట్లకు ఆశపడి జనసేన అధ్యక్షుడిపై నోరు పారేసుకుంటున్నారని వీర మహిళలు కౌంటర్ ఇచ్చారు.