ASF: కెరమెరి గ్రామ పంచాయతీ 2026-27 సంవత్సరానికి వారసంత వేలం పాట నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి గణేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పెందోర్ ఆనందరావు ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహిస్తామన్నారు. వారసంత వేలం పాటలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజనులు మాత్రమే పాల్గొనాలని పేర్కొన్నారు.