ధ్రువ సర్జా నటించిన ‘KD: ది డెవిల్’ చిత్రంలోని ‘సర్కే చునర్ తేరి సర్కే’ సాంగ్ అశ్లీలంగా ఉందంటూ తీవ్ర వివాదం నెలకొంది. ఈ పాట మైనర్లకు హాని కలిగించేలా, అసభ్యకరంగా ఉందంటూ న్యాయవాది వినీత్ జిందాల్ CBFCకి ఫిర్యాదు చేశారు. దర్శకుడు ప్రేమ్, గాయని మంగ్లీ సహా చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఈ పాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.