విశాఖలోని వాల్తేరు డివిజన్ టికెట్ తనిఖీ బృందం ట్రైన్ నం.15629లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. శ్రీకాకుళం రోడ్ స్టేషన్లో ఒక నిమిషం ఆపి సోదాలు చేపట్టి, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 312 మందిని గుర్తించారు. వారి నుంచి రూ.2.42 లక్షలు జరిమానా వసూలు చేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా టికెట్లు తీసుకుని ప్రయాణించాలని అధికారులు సూచించారు.