»Son Protects Mother Chases Away Robber Trying To Snatch Her Purse Viral
Viral Video: తల్లి పర్సు లాక్కున్న దొంగను తరిమికొట్టిన కొడుకు
దొంగల నుంచి తల్లిహ్యండ్ బ్యాగ్‌ను కాపాడిన ఓ కొడుకుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దొంగలు తల్లి వద్ద ఉన్న బ్యాగ్ లాక్కొవడానికి ప్రయత్నించగా.. కొడుకు ప్రతిఘటించడం వీడియోలో చూడవచ్చు.
Son protects mother, chases away robber trying to snatch her purse. Viral
Viral News: తల్లి పర్సు లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగ(thief)ను తరిమికొట్టి తల్లిని కాపాడిన కొడుకుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుడ్‌న్యూస్ మూవ్మెంట్(goodnews_movement) ఇన్స్టాగ్రామ్(Instagram) హ్యాండిల్లో ఈ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియో ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా చూశారు. కొడుకును మెచ్చుకుంటూ పలువురు నెటిజనులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియో ఫూటేజ్ ప్రస్తుతం వైరల్ అవడం కాకుండా అందరిలో ఒక స్పూర్తిని నింపుతుంది. తల్లికొడుకులిద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముచ్చటించుకుంటూ నడుచుకుంటు వెళ్తున్నారు. అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు కాపుకాస్తు ఉన్నారు. ఒకతను బైక్ స్టార్ట్ చేసి దానిపై కూర్చొని ఉన్నాడు. ఇంకో అతను అదునుకోసం ఎదరుచూస్తూ ఉన్నాడు. వారు దగ్గరకు రాగానే ఒక్కసారిగా వారి మీదకు పడుతూ హ్యండ్ బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేశాడు.
ఆ క్రమంలో వెంటనే అప్రమత్తం అయిన కొడుకు అతని చేతులో బ్యాగ్ చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. అతన్ని బలంగా నెట్టేశాడు. ఇది జరుగుతున్నప్పుడు వెనుక ఓ మహిళా నడుచుకుంటు వెళ్తుంది. వీరి ఘర్షణ చూసి పరుగెడుతుంది తప్పా వీరికి మద్దతుగా నిలబడలేదు. కొడుకు బలంగా ప్రతిగటించడంతో అతను బెదిరిపోయాడు. అంతలో తల్లి బ్యాగ్‌ను కిందపడేసి కొడుకును కాపాడాలని చూస్తుంది. దొంగలు అక్కడినుంచి పారిపోతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. తల్లి కొడుకులను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. వారి ధైర్యాన్ని కూడా కొనియాడుతున్నారు.