ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు.. రేపో మాపో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. ఇటీవలె ఇండియన్ 2 తిరిగి పట్టాలెక్కించిన శంకర్.. దాంతో పాటు ఆర్సీ 15ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తానని, సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ మొదలుపెడతానని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చరణ్ లుక్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. చరణ్ హెలీకాఫ్టర్ నుంచి దిగుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే గెటప్పులో ఉన్న మరో ఫోటో కూడా దుమ్ము దులుపుతోంది. ఈ ఫోటల్లో మెగా పవర్ స్టార్.. సూటు బూటు ధరించి.. రఫ్‌గా గడ్డంతో.. కూలింగ్ గ్లాసెస్ ధరించి.. అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.
అయితే ఈ లుక్ సినిమా కోసమా లేక యాడ్ కోసమా.. అనే సందేహాలొస్తున్నాయి. ప్రస్తుతం చరణ్ వరుస యాడ్స్‌తో కమర్షియల్‌గా కాస్త దూకుడు పెంచాడు. రీసెంట్గా రెండు, మూడు బడా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కమిట్ అయినట్టు టాక్. దాంతో ఇప్పుడు చరణ్ ఆ యాడ్స్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫోటోలు వాటికి సంబంధించినవేనని అంటున్నారు. మరో వైపు ఈ లుక్ ఆర్సీ 15దేనని ప్రచారం జరుగుతోంది. అయితే చరణ్ లుక్ దేనికోసమనేది పక్కన పెడితే.. ఈ లేటెస్ట్ లుక్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే.. ఆర్సీ 15లో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తుండగా.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.