TPT: పుత్తూరులో ఈనెల 17న జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి తెలిపారు. ఈ మేళాకు మొత్తం 10 బహుళజాతి కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.