TPT: పాకాల (M) దామల చెరువులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి విష్వక్సేన పూజతో ప్రారంభమై ఈ నెల 29వ తేదీ ధ్వజావరోహణంతో ముగుస్తాయి. ప్రతి రోజూ స్వామి వారు పగలు, రాత్రి ఒక్కొక్క వాహనంపై దర్శనమిస్తారు. 21వ తేది గరుడ వాహనం, 25న రథోత్సవం, 28వ తేదీన కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.