»Renu Desais Key Comments On Pawan Beg Him Not To Pull Children
Renu Deasai: పవన్‌పై రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు..పిల్లల్ని లాగొద్దని వేడుకోలు
ఏపీ రాజకీయాలపై, జనసేన అధినేత పవన్‌పై నటి రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పిల్లలను రాజకీయాల్లో లాగొద్దని సూచించారు. రాజకీయ పరంగా తన సపోర్ట్ పవన్‌కే ఉంటుందని ఆమె తెలిపారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసుకోవడం ఆపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Ap politics) మరింత హీటెక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతల తమదైన వ్యూహాలతో దూసుకుపోతున్నారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, పర్సనల్ లైఫ్‌ను టచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడంతా ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలపైనే ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ (Renu Desai) పెదవివిరిచారు.
ఏపీ రాజకీయాలపై, పవన్‌పై రేణూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి తనను, తన పిల్లలను లాగొద్దని ఆమె అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తన మాజీ భర్త పవన్‌కు తనకు సంబంధించిన అంశాలతో సినిమాలు, ఓటీటీ సీరిస్‌లను కొందరు తీస్తామంటున్నారని, అది మంచి పద్దతి కాదని తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, అయితే వాటిల్లోకి పిల్లలను, మహిళలను లాగొద్దని వేడుకున్నారు.
తన పిల్లలే కాదని, ఏ రాజకీయ నాయకుడి పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదన్నారు. పవన్ డబ్బు మనిషి కాదన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీసుకురావొద్దని సూచించారు. తన విషయంలో పవన్ చేసింది తప్పేనని, అయితే దాన్ని రాజకీయాల్లో తీసుకురాకండని రేణూ దేశాయ్ సూచన చేశారు. తనతో పాటు మిగిన వారి పిల్లల గురించి కూడా మాట్లాడుకోవడం ఆపాలని సూచించారు. పవన్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తావించడం ఆపాలని కోరింది.
పర్సనల్ లైఫ్ పక్కనబెడితే సొసైటీకి పవన్ వల్ల మంచి జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. పొలిటికల్‌గా తన సపోర్ట్ ఎప్పుడూ పవన్‌కే ఉంటుందన్నారు. రాజకీయాలను ప్రొఫెషనల్‌గా చూసుకోవాలని, వ్యక్తిగత జీవితాలను అందులోకి లాగొద్దని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.