KDP: జడ్పీ సీఈవో ఓబులమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మంగళవారం నుంచి ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 35 మండలాలకు 510 ట్రై సైకిళ్లను అందించనున్నారు. మండలాల్లో ఉండే డిప్యూటీ ఎంపీడీవోలకు మండల హెడ్ క్వార్టర్లో నేరుగా వీటిని అందిస్తారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.