పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ నెల 19న విడుదల కానుండటంతో తెలంగాణలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఏపీలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, తెలంగాణలో మాత్రం పాత ధరలకే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పవర్ స్టార్ సినిమా కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి అప్పుడే మొదలైంది.