జాతీయవాద హీరోగా ముద్ర వేయించుకోవడం కోసం తాను దేశభక్తి సినిమాలు చేయనని హీరో అక్షయ్ కుమార్ స్పష్టం చేశాడు. తన కెనడియన్ పాస్‌పోర్ట్‌పై వచ్చే విమర్శలకు, తన సినిమాలకు సంబంధం లేదని వెల్లడించాడు. కేవలం ఇమేజ్ కోసం కాకుండా.. తనకు సరైనవనిపించే కథలను మాత్రమే ఎంచుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఎంపికలో కథా బలమే ముఖ్యం తప్ప వేరే ఉద్దేశం లేదని తెలిపాడు.