VSP: పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిప్పల శ్రీనివాస్, మొల్లి అప్పారావు, కట్టుమురి సతీష్, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.